News

ఓటు బ్యాంకును తిప్పుకుంటాం-బిజెపి


ఏపి లో బిజెపి బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని ఆ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ సిద్దార్ద్ సింగ్ చెప్పారు. మిత్రదర్మాన్ని పాటిస్తామని, టిడిపితో సంబందాలు మరింత బలపడతాయని ఆయన అబిప్రాయపడ్డారు. కాంగ్రెస్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంకులను తమ వైపు తిప్పుకునే కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఆంధ్ర ప్రదేష్‌కి   ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరగదని, ఎపి ప్రజల మనోగతాన్ని పరిగణనలోకి తీసుకుంటారని అన్నారు. ఎపికి విభజన హామీలన్నిటిని నెరవేర్చే దిశంలో కేంద్రం పనిచేస్తుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబందించి పార్టీ అద్యక్షుడు కంభంపాటి హరిబాబు చేసిన సూచనలను పాటిస్తామని సిద్దార్ద్ సింగ్ అన్నారు.మిత్ర పక్షమైన టిడిపి జోలికి వెళ్లకుండా విపక్షంలో ఉన్న కాంగ్రెస్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ల నుంచే నేతలను కాని, క్యాడరును కాని చేర్చుకుంటామని ఆయన చెబుతున్నారనుకోవచ్చు.